Friday, 3 July 2020

జామపండ్లు తింటే జలుబు చేస్తుందా..

జామపండ్లు తింటే జలుబు చేస్తుందా..

జామపండ్లు.. అందరికీ చాలా ఇష్టం.. తక్కువ ధరలోనే లభించే ఈ పండు ఏమేం ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి.. ఈ ................

8 Health Benefits of Guava Fruit and Leaves

సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి అనేక మేలు జరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెబుతారు. అందుకే ఆయా సీజన్స్‌కి సంబంధించిన పండ్లు మార్కెట్లో సందడి చేస్తుంటాయి. రెగ్యులర్‌గా వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆ సీజన్‌లో వచ్చే సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Do You Know Why Guava Is Considered a Superfruit? - Shaila ...

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే పండ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్‌లో ఎక్కువగా  మనకి GUAVA అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా కాచే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇప్పుడైతే మార్కెట్లో ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ, పూర్వ కాలంలో అయితే అందరి ఇళ్ళల్లో ఈ చెట్లు ఉండేవి. ఊరికే ప్రతి ఒక్కరూ ఈ పండ్లని అడిగి తీసుకుని తినేవారు.

ఇప్పుడు సిటీల్లో వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అయినా సరే.. మిగతా పండ్లతో పోలిస్తే వీటి రేట్లు తక్కువనే చెప్పాలి. దీంతో చాలా మంది కొనేందుకు, తినేందుకు ఆసక్తి చూపిస్తారు. తక్కువ ధరకే ఇవి లభించినా.. వీటితో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. అందుకే తీసుకుంటారు..

వర్షాకాలంలో ఎక్కువగా లభించే వీటిని తినడం వల్ల జలుబు చేస్తుందని అంటారు. ఇది నిజమేనా.. అసలే కరోనా టైమ్ జలుబు, జ్వరాలు అంటే అంతా భయపడతారు. అందుకే వీటిని దూరం పెడుతుంటారు. అలా కాకుండా నిజంగా ఈ పండ్లని తినడం వల్ల జలుబు చేస్తుందా అంటే అందులో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు నిపుణులు. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకానీ, జలుబు అవుతుందని అపోహలు పెట్టుకోవద్దని చెబుతున్నారు.
How to relieve from cold and cough tips in Telugu - జలుబు ...

అయితే, కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు. అలాంటి వారికి కాస్తా సమస్య వస్తుంది. మిగతావారు హ్యాపీగా తినొచ్చు. ఈకాలంలో ఎక్కువగా నిమ్మ, జామ, ఉసిరి కాయలు తినడం చాలా మంచిది. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అంతేకానీ, ఏవేవో కారణాలు చెప్పి ఈ ఆరోగ్య ఫలాలని దూరం చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

జామపండుతో ఏమేం సమస్యలు తగ్గుతాయంటే.
సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనకి ప్రకృతి ప్రసాదం.. వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా జామపండ్లు తినడం వల్ల నోటి సమస్యలు, మలబద్ధకం, జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుబాటులో వీటిని తినడం వల్ల ఎన్నో రకాల మేలు జరుగుతాయి.. హ్యాపీగా తినడం మంచిది.. మీరూ వీటిని అలానే తినడం ఇష్టం లేకపోతే సలాడ్స్ వంటి వాటిల్లోనూ ట్రై చేయొచ్చు.

No comments:

Post a Comment

DATA Entry Operator/full & Part-time/work FROM Home/computer Operator

Job description Immediate Opening for Data Entry Operator Transfer data from PDF formats in system. Computer / Laptop Or Android Phone I...