Saturday, 25 July 2020

pixelLab apk premium version


Thanks for visting my website 
am so glad to give you this Premium App

TO DOWNLOAD PIXALLAB CLICK HERE BELOW 
GO DOWN 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..
.
.
..
.
.
.
.
.
.
.
.
'.
.
.
.
.


HERE YOU CLICK THIS LINK


DO SUBSCRIBE MY CHANNEL AND PLEASE SUPPORT ME THANK YOU SO MUCH

Sunday, 5 July 2020

నిమ్మ పండు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండు, వైరస్‌కు చుక్కలే !

కరోనా వైరస్ గురించి వర్రీ కావద్దు. ఒక వేళ అది సోకినా.. దానితో పోరాడే శక్తిని ఇచ్చేందుకు నిమ్మ రసాన్ని తీసుకోండి. నిమ్మతో కలిగి మరిన్ని ఈ ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.


నిమ్మతో ఆరోగ్యం

నిమ్మకాయలో ఉన్న ఔషద గుణాలు అన్నీ ఇన్నీ కావు. నిమ్మ తొక్క నుంచి రసం వరకు ప్రతి ఒక్కటీ శరీరానికి మేలు చేసేవే. నిమ్మలో విటమిన్‌ C, విటమిన్‌ B, కాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఆయుర్వేదంతో పాటు పలు రకాల ఔషదాల తయారీకి నిమ్మ పండును వినియోగిస్తుంటారు. అందుకే, నిమ్మను సకల రోగాల నివారణిగా పిలుస్తుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది నిమ్మను రోజువారీ ఆహారంతో తీసుకుంటున్నారు. నిమ్మతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రోజూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆహర నిపుణులు చెబుతున్నారు. మరి, నిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూసేద్దామా!

❂ నిమ్మ రసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది.
❂ నిమ్మ రసంలో తేనె కలుపుకుని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. కాలేయం శుభ్రమవుతుంది.
❂ నోటి పూతకు నిమ్మ మంచి ఔషదం.
❂ నిమ్మ రసంలోని సిట్రిక్‌ యాసిడ్‌ కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తుంది.
❂ బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది.
❂ మంచి పోషక పదార్ధాలతోపాటు నిమ్మరసం తీసుకుంటే మహిళల్లో గర్భస్రావాలు ఉండవు.
❂ జలుబు తగ్గాలంటే నిమ్మ షర్బత్ తాగండి.
❂ జీర్ణక్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం లాంటి వాటిని తగ్గించటంలో నిమ్మరసం సహాయపడుతుంది.
❂ గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టు మొదలైన చర్మవ్యాధులతో బాధపడేవారు నిమ్మరసాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

❂ నిమ్మ వల్ల మూత్రంలో సిట్రేట్‌ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవు.
❂ చిన్న పిల్లల్లో వచ్చే టాన్సిలైటిస్‌ సమస్యకు చెంచాడు నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణం వేసి తాగిస్తే ఫలితం కనిపిస్తుంది.
❂ నిమ్మరసంలో చిటికెడు ఉప్పు, వంటసోడా కలిపి దంతాల మీద రుద్దితే దుర్వాసన పోతుంది.
❂ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.

❂ శరీరంలో వాపు, కణాలు దెబ్బతినడానికి కారణమయ్యే కణాలను విటమిన్‌-C నిర్వీర్యం చేస్తుంది.
❂ రోజూ ఆహారంలోగానీ, విడిగాగానీ నిమ్మరసాన్ని తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల వ్యాధులు దరిచేరవు.
❂ జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే కాస్త ఉపశమనం ఉంటుంది.
❂ దగ్గు మందుల్లో కఫాన్ని తగ్గించడానికి కూడా నిమ్మరసం కలుపుతారు.
❂ నిమ్మ ఆకుల రసానికి తేనె కలిపి ఇస్తే కడుపులో నూలి పురుగులు తగ్గుముఖం పడతాయి.
❂ గుండెల్లో మంట, డయేరియా, బద్ధకం నివారణకు నిమ్మరసం మంచి ఔషధం
❂ కొవ్వు తగ్గించడంలో నిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.
❂ బ్యాక్టీరియా వల్ల కలిగే దుర్వాసనను నిర్మూలించే లాలాజలాన్ని నిమ్మరసం ఉత్పత్తి చేస్తుంది.
❂ రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
❂ నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
❂ కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా బ్రష్ చేస్తే దంతాలు మెరుస్తాయి.
❂ ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం లేదా నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం కలుగుతుంది.

Saturday, 4 July 2020

రోజ్ వాటర్‌తో మీ అందాన్ని పెంచుకోండిలా!

రోజ్ వాటర్‌తో మీ అందాన్ని పెంచుకోండిలా!


మీ ఇంట్లో రోజ్ వాటర్ ఉందా? లేకపోతే వెంటనే తీసుకోండి. దీని ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.

రోజ్ వాటర్‌తో మీ అందాన్ని పెంచుకోండిలా!

రోజ్ వాటర్... అందంగా ఉండాలని కోరుకునే ప్రతి అమ్మాయి ఇంట్లో ఇది తప్పకుండా ఉంటుంది. దీని ధర కూడా అందుబాటులోనే ఉండడంతో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో రోజ్ వాటర్ తర్వాతే మరేదైనా. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. నిగారింపుని తెస్తుంది. రోజ్ వాటర్ ఇంట్లో ఉంటే చాలు.. ఖరీదైనా టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములతో అవసరమే ఉండదు.

❂ రోజంతా బయటి పనులతో మనమూ, మనతో పాటూ చర్మం కూడా వడలిపోతుంది. బోలెడంత కాలుష్యం ముఖానికి అంటుకుంటుంది. ఫేస్‌వాష్ చేసుకున్నా సరే.. ఈ మురికి వదలదు. ఇంటికెళ్లాక ముఖాన్ని శుభ్రం చేసుకుని.. కాస్త రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ఫేస్‌ను తుడవండి. చర్మంపై పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

❂ ఎండలో బాగా తిరిగితే చాలు ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. అలాంటప్పుడు రోజ్ వాటర్‌లో కీరదోస రసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంలో దూది ముంచి మొత్తం శుభ్రం చేయాలి. ట్యాన్ పోతుంది.

❂ రోజ్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. గులాబీ నీళ్లలో ముంచి దూదిని కళ్ల కింద తరచూ పెట్టుకుంటే ఆ వలయాలు మాయమవుతాయి.

❂ తలలో చుండ్రు తగ్గాలంటే తలకి స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

❂ మొటిమలున్న వారు రోజూ గులాబీనీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మరవద్దు.


Friday, 3 July 2020

చైనాకు మరో షాక్.. అమెరికాలోనూ ‘టిక్‌టాక్’ బ్యాన్‌కు డిమాండ్!

చైనాకు మరో షాక్.. అమెరికాలోనూ ‘టిక్‌టాక్’ బ్యాన్‌కు డిమాండ్!


భారత తరహాలోనే అమెరికా సైతం చైనా యాప్స్‌పై నిషేదం విధించే యోచనలో ఉంది. ఈ మేరకు ప్రజలు, ప్రజా ప్రతినిధు

లు, మీడియా నుంచి గట్టిగా డిమాండ్ వినిపిస్తోంది.


TikTok finally finds favour with India's social media elite ...

నిబంధనలు అతిక్రమించి.. దురాక్రమణ దాహంతో కొట్టిమిట్టాడుతున్నా చైనాకు బుద్ధి చెప్పేందుకు ఇండియా ‘టిక్‌టాక్‌‌‌’‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియా బాటలోనే అమెరికా కూడా నడిచే యోచనలో ఉంది. అక్కడ కూడా టిక్‌టాక్ బ్యాన్ చేసేందుకు సన్నహాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా బాటలోనే అమెరికా కూడా నడవాలని, చైనా యాప్‌లను బ్యాన్ చేయాలనే డిమాండ్ అక్కడ ఊపందుకుంది.

TikTok faces criticism in India over content moderation | PR Week

కరోనా వైరస్ ప్రభావంతో అమెరికా-చైనా మధ్య సంబంధాలు సన్నిగిల్లిన సంగతి తెలిసిందే. పైగా, మిత్ర దేశమైన ఇండియాతో చైనా వ్యవహరిస్తున్న తీరు కూడా అమెరికా పెద్దలకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో చైనాకు తగిన బుద్ధి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. కరోనా వైరస్ ఎదుర్కొంటున్న దేశాలతో పోల్చితే.. ఆర్థికంగా బలంగా ఉన్న దేశం ఇప్పుడు చైనాయే కనిపిస్తోంది. అమెరికా సైతం ఇప్పుడు లెక్కలేనన్ని కేసులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. చైనాకు బుద్ధి చెప్పాలంటే దాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం ఒకటే మార్గమని, తమ దేశ భద్రతకు చైనా యాప్స్‌తో ముప్పు ఉండవచ్చని భావిస్తోంది.

Senate bill seeks to ban Chinese app TikTok from government work ...

టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌పై భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రిపబ్లికన్‌ సెనెటర్‌ జాన్‌ కోర్నిన్‌ సహా పలువురు ప్రముఖులు భారత్‌కు మద్దతు తెలిపారు. అమెరికాలో సైతం టిక్‌టాక్ పిచ్చి బాగా ముదిరింది. సుమారు 4 కోట్లకు అమెరికా ప్రజలు టిక్ టాక్ వాడుతున్నారు. దీనివల్ల చైనా సంస్థలు ఆర్థికంగా లాభపడుతున్నాయి. పైగా, ఆ యాప్ యూజర్ల వ్యక్తిగత సమాచారం మొత్తం చైనా చేతిలో ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్ యాప్‌ను ఉపయోగించరాదని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకోరాదంటూ మార్చి నెలలోనే బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వీటిపై నిర్ణయం పెండింగులో ఉంది. అమెరికాలో టిక్‌టాక్ నిషేదంపై పలువురు మీడియా ప్రతినిధులు కూడా గళమెత్తుతున్నారు. మరి, అమెరికా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

12 ఏళ్లుగా బీరు తయారీకి మూత్రం కలుపుతున్న ఉద్యోగి! నిజం ఏమిటంటే..

12 ఏళ్లుగా బీరు తయారీకి మూత్రం కలుపుతున్న ఉద్యోగి! నిజం ఏమిటంటే..


బీరు తయారీకి ఓ ఉద్యోగి తన మూత్రం కలుపుతున్నాడనే వార్త విని మందుబాబులు షాకయ్యారు. అయితే, ఈ వార్తలో 

ఊహించని ట్విస్ట్ ఉంది. అదేమింటంటే..


Viral 'report' claims Budweiser employee has been pissing into ...

మందుబాబులకు షాకిచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. బీరు తయారీ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి 12 ఏళ్లుగా ‘మూత్రం’ పోస్తున్నాడట. అందులో వింత ఏముందు అనుకుంటున్నారా? అతడు ఆ మూత్రాన్ని పోస్తోంది మరెక్కడో కాదు.. బీరు తయారీకి ఉపయోగించే ట్యాంకులో. వామ్మో.. ఇంతకీ ఏ కంపెనీ బీరు అది అని భయపడుతున్నారా? అయితే, గుండె నిబ్బరం చేసుకోండి. అసలు నిజం తెలుసుకొనేందుకు ఈ కథనం పూర్తిగా చదవండి.
ఓ వెబ్‌సైట్లో‌ పేర్కొన్న వివరాల ప్రకారం.. బడ్వైజర్ (Budweiser) బ్రేవరీ అనే బీర్ల సంస్థలో పనిచేస్తున్న వాల్టెర్ పావెల్ (పేరు మార్చారు) వ్యక్తి గత 12 ఏళ్లుగా బీర్ ట్యాంకులోనే మూత్రం పోస్తున్నాడట. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘నా స్నేహితులు బడ్వైజర్ బీరు తాగుతామంటే జాలిపడేవాడిని. నాకు బద్దకం చాలా ఎక్కువ. అందుకే, బీరు ట్యాంకులోనే మూత్రం పోసేవాడిని’’ అని తెలిపాడు.

Budweiser - 10 facts you didn't know about the self-proclaimed ...

‘‘తొలిసారిగా నేను బీరు ట్యాంకులో మూత్రం లేకుండా నీటిని నింపుతున్నా. ఇక అందరూ నా మూత్రానికి బదులు.. బడ్వైజర్ బీరులోని అసలైన రుచిని ఆస్వాదించవచ్చు. నా యజమాని ఇప్పుడు నన్ను ఎంతగానో నమ్ముతున్నాడు. ఇకపై నేను అలాంటి పనులు చేయను’’ అని అని తెలిపాడు. ఈ వార్త వైరల్ కావడంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇందులో మీరు ఊహించని ట్విస్టు ఉంది. అదేమిటంటే...

Fact Check: क्या Budweiser कर्मचारी 12 साल से ...

ఈ వార్తను ప్రచురించిన foolishhumour.com అనే వెబ్‌సైట్ కేవలం ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఈ ఆర్టికల్ పోస్ట్ చేసింది. వార్త చివర్లో ఇది కల్పిత ఘటన అని, వాస్తవ జీవితానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే, ఈ నిజం తెలియక ఎంతోమంది మందుప్రియులు మదనపడిపోతున్నారు. అయ్యో.. ఇన్ని రోజులు మేము.. వాడి పోసినదే బీరు అనుకుని తాగేశామా అని వాపోతున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత ‘హమ్మయ్య..’ అని ఊపిరి పీల్చుకుంటున్నారు. కాబట్టి.. బీరులో ఉద్యోగి మూత్రం కలుపుతున్నాడనే వార్త.. ఫేక్!

జామపండ్లు తింటే జలుబు చేస్తుందా..

జామపండ్లు తింటే జలుబు చేస్తుందా..

జామపండ్లు.. అందరికీ చాలా ఇష్టం.. తక్కువ ధరలోనే లభించే ఈ పండు ఏమేం ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వీటిని తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి.. ఈ ................

8 Health Benefits of Guava Fruit and Leaves

సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి అనేక మేలు జరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెబుతారు. అందుకే ఆయా సీజన్స్‌కి సంబంధించిన పండ్లు మార్కెట్లో సందడి చేస్తుంటాయి. రెగ్యులర్‌గా వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆ సీజన్‌లో వచ్చే సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Do You Know Why Guava Is Considered a Superfruit? - Shaila ...

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే పండ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్‌లో ఎక్కువగా  మనకి GUAVA అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా కాచే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇప్పుడైతే మార్కెట్లో ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ, పూర్వ కాలంలో అయితే అందరి ఇళ్ళల్లో ఈ చెట్లు ఉండేవి. ఊరికే ప్రతి ఒక్కరూ ఈ పండ్లని అడిగి తీసుకుని తినేవారు.

ఇప్పుడు సిటీల్లో వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అయినా సరే.. మిగతా పండ్లతో పోలిస్తే వీటి రేట్లు తక్కువనే చెప్పాలి. దీంతో చాలా మంది కొనేందుకు, తినేందుకు ఆసక్తి చూపిస్తారు. తక్కువ ధరకే ఇవి లభించినా.. వీటితో కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. అందుకే తీసుకుంటారు..

వర్షాకాలంలో ఎక్కువగా లభించే వీటిని తినడం వల్ల జలుబు చేస్తుందని అంటారు. ఇది నిజమేనా.. అసలే కరోనా టైమ్ జలుబు, జ్వరాలు అంటే అంతా భయపడతారు. అందుకే వీటిని దూరం పెడుతుంటారు. అలా కాకుండా నిజంగా ఈ పండ్లని తినడం వల్ల జలుబు చేస్తుందా అంటే అందులో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు నిపుణులు. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకానీ, జలుబు అవుతుందని అపోహలు పెట్టుకోవద్దని చెబుతున్నారు.
How to relieve from cold and cough tips in Telugu - జలుబు ...

అయితే, కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు. అలాంటి వారికి కాస్తా సమస్య వస్తుంది. మిగతావారు హ్యాపీగా తినొచ్చు. ఈకాలంలో ఎక్కువగా నిమ్మ, జామ, ఉసిరి కాయలు తినడం చాలా మంచిది. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అంతేకానీ, ఏవేవో కారణాలు చెప్పి ఈ ఆరోగ్య ఫలాలని దూరం చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

జామపండుతో ఏమేం సమస్యలు తగ్గుతాయంటే.
సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనకి ప్రకృతి ప్రసాదం.. వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా జామపండ్లు తినడం వల్ల నోటి సమస్యలు, మలబద్ధకం, జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుబాటులో వీటిని తినడం వల్ల ఎన్నో రకాల మేలు జరుగుతాయి.. హ్యాపీగా తినడం మంచిది.. మీరూ వీటిని అలానే తినడం ఇష్టం లేకపోతే సలాడ్స్ వంటి వాటిల్లోనూ ట్రై చేయొచ్చు.

Thursday, 2 July 2020

బొప్పాయితో కరోనాకు చుక్కలే.. రోగ నిరోధక శక్తికి ఇదే బెస్ట్ ఫ్రూట్!

బొప్పాయితో కరోనాకు చుక్కలే.. రోగ నిరోధక శక్తికి ఇదే బెస్ట్ ఫ్రూట్ !

రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే, తప్పకుండా ఈ పండును మీ డైట్‌లో చేర్చుకోండి. అన్నిరకాలకు ఇదే సరైన మందు.

Papayya - The Indian Weekly

కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం పైనే ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాడగడం, పసుపు పాలను సేవించడం అలవాటు చేసుకుంటున్నారు. కొందరు వ్యాయామాలతో ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటితోపాటు వివిధ పండ్లను తీసుకుంటూ ఆరోగ్యంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫ్రూట్ ఏమిటనే సందేహం చాలామందికి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్లలో బొప్పాయే మంచి రోగ నిరోధక శక్తిని అందించే ఫ్రూట్ అని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో చూసేద్దామా!

Papayya - The Indian Weekly

కరోనా వైరస్ మొదలైన రోజు నుంచి సోషల్ మీడియాలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాల గురించి అనేక పోస్టులు షేరవ్వుతున్న సంగతి తెలిసిందే. అల్లం, వెల్లులి, తేనె, తులసి వంటివి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయిని చెబుతున్నారు. అయితే, వీటిని రోజు తీసుకోవడం కొంచెం కష్టమే. పైగా ఇవి నోటికి పెద్దగా రుచించవు కూడా. అలాగని, వాటిని మానేయడం కూడా అంత శ్రేయస్సు కాదు. అయితే, బొప్పాయి పండు మీ నోటిని తీపి చేయ్యడమే కాకుండా వైరస్‌తో కూడా పోరాడుతుంది. ఇది దీర్ఘాకాలిక రోగాలను సైతం దూరంగా ఉంచుతుంది.

Edraak | Learn The Fight between Corona Virus and the Human Immune ...

బొప్పాయిని ఇన్నాళ్లు మనం సాధారణ పండుగానే భావిస్తున్నాం. భిన్నమైన రుచితో తినేకొద్ది తినాలనిపిస్తుంది. బొప్పాయి, వాటిలోని ఇతరాత్ర పదార్థాలను ఔషదాలను తయారీకి ఉపయోగిస్తారనే సంగతి మీకు తెలుసా? ఆయుర్వేదంలో కూడా బొప్పాయి ఏ విధంగా ఆరోగ్యాన్ని అందిస్తుందనే విషయం ప్రస్తావనలో ఉంది. బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో బోలెడంత ఫైబర్ ఉంటుంది. ఫోలేట్, B6, కాల్షియం, మ్యాగ్నిషియం, విటమిన్ A, C, B1, B3, E, K, పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లెమ్యాటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. బొప్పాయి పండు మాత్రమే కాదు, ఆకులు కూడా ఆరోగ్యకరమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ట కౌంట్ పెంచేందుకు ఆకులు ఉపయోగపడతాయట.

samayam telugu

బొప్పాయి పండు జీర్ణశక్తిని పెంపొందించడంలో కీలకంగా పనిచేస్తుంది. విరేచన సమస్యలను సహస సిద్ధంగా నివారిస్తుంది. అందుకే బొప్పాయి జీర్ణక్రియకు సంజీవని వంటిందని అంటారు. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ మూత్ర విసర్జన సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. శరీరానికి పోషకాలను అందించేందుకు సహకరిస్తుంది. బొప్పాయి రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తుంది. ఎందుకంటే.. అత్యధిక రోగ నిరోధక కణాలన్నీ ఆంత్రము లేదా పెద్ద, చిన్న పేగుల్లోనే ఉంటాయి. బొప్పాయి వల్ల అవి ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

రోగాలతో పోరాడుతుంది.

Coronavirus: How to tell the difference between a dry cough and a ...

బొప్పాయిలో ఉండే అత్యధిక యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్.. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. దీనివల్ల శరీరానికి వైరస్, బ్యాక్టీరియాల, సూక్ష్మ జీవులపై పోరాడే శక్తి లభిస్తుంది. బొప్పాయిలోని విటమిన్ C, E, బీటా కారోటీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఊపిరితీత్తులు, నాసికా కుహరం (ముక్కు రంథ్రాలు)లో గాలి ప్రసరణ సమస్యలను తగ్గిస్తాయి. జ్వరం, గొంతు మంట, జలుబు వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Life-Saving Facts About Heart Attack | Calallen, TX Emergency Room

బొప్పాయిలో విటమిన్ C, Eతోపాటు లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వులను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ధమనుల్లో పేరుకుపోయే కొవ్వులను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెకు హాని చేసే చెడు కొవ్వు పేరుకుపోకుండా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా భవిష్యత్తులో గుండె సమస్యలే ధరిచేరవు. బొప్పాయి కణితులు, క్యానర్స్‌ కణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో భాగంగా బొప్పాయిని తీసుకోవడం మంచిదని చెబుతారు. అయితే, దీన్ని డైట్‌లో చేర్చుకోడానికి ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

రక్తపోటు, మధుమేహం సమస్యలు నివారిస్తుంది


What Is a 'Mild Heart Attack' (and Is It a Big Deal, or Not ...

బొప్పాయిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో హై బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రించి బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలో అధిక సోడియంను సైతం ఇది బ్యాలెన్స్ చేస్తుంది. స్క్రోక్స్ వంటి సమస్యలు కూడా రానివ్వదు. అలాగే, మధుమేహం రోగులకు సైతం బొప్పాయి మంచిదే. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మధుమేహాన్ని సహజంగా నయం చేయడానికి ఉపయోగపడతాయి. బొప్పాయిలో కేలరీలు తక్కువ. కాబట్టి బరువు పెరగరు. మధుమేహం ఉన్న వారు, వస్తాదని భయపడేవారు బొప్పాయిని తినొచ్చు. అయితే, ఇందులో సహజసిద్ధ చక్కెర్లు ఉంటాయి. కాబట్టి మితంగానే తినాలి. బొప్పాయిలో ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. లంచ్, డిన్నర్‌కు మధ్యలో సాయంత్రం వేళ కొన్ని బొప్పాయి ముక్కలను తింటే మంచిది. కరోనా వల్ల మధుమేహం రోగులకే ఎక్కువ ప్రమాదం కాబట్టి.. వైద్యుల సలహా తర్వాతే ఈ డైట్‌ను తీసుకోండి. గమనిక: వైద్య నిపుణుల సూచనలు, పరిశోధనలు ఆధారంగా ఈ సమాచారాన్ని మీకు అందించాం. మీకు పండ్ల వల్ల అలర్జీలు, మరే ఇతర సమస్యలు ఉన్నా.. తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలి. ఈ వివరాలను కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నామనే విషయాన్ని గమనించగలరు.


చైనా ఫోన్లు కొనకూడదు అనుకుంటున్నారా? టాప్-10 నాన్-చైనా స్మార్ట్ ఫోన్లు ఇవే!

చైనా ఫోన్లు కొనకూడదు అనుకుంటున్నారా? టాప్-10 నాన్-చైనా స్మార్ట్ ఫోన్లు ఇవే!
Non Chinese Smartphones
ప్రస్తుతం మనదేశంలో చైనాపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. కరోనా విషయంలో చైనాపై ముందునుంచే మనదేశంలో వ్యతిరేకత నెలకొంది. అయితే సరిహద్దుల్లో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. మనదేశంలో చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చైనా కంపెనీలకు చెందిన మొబైల్స్ ను కూడా ఇకపై కొనుగోలు చేయకూడదని కొంతమంది నిర్ణయించారు. ప్రస్తుతం మనదేశంలో అన్ని ధరల స్థాయిలో చైనా బ్రాండ్ల ఫోన్లు కాకుండా ఉన్న టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఇవే!
1. శాంసంగ్ గెలాక్సీ ఎం20
డిస్ ప్లే: 6.3 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే కెమెరా: 13 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా: 8 మెగా పిక్సెల్ ర్యామ్: 3 జీబీ బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ప్రాసెసర్: శాంసంగ్ ఎక్సినోస్ 7904 ధర: రూ.9,999 నుంచి ప్రారంభం

2. నోకియా 8.1
డిస్ ప్లే: 6.18 అంగుళాల డిస్ ప్లే కెమెరా: 12 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 20 మెగా పిక్సెల్ ర్యామ్: 4 జీబీ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 ధర: రూ.17,999 నుంచి ప్రారంభం
3. శాంసంగ్ గెలాక్సీ ఎం31
డిస్ ప్లే: 6.4 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే కెమెరా: 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్ ర్యామ్: 6 జీబీ బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
ప్రాసెసర్: శాంసంగ్ ఎక్సినోస్ 9611 ధర: రూ.16,499 నుంచి ప్రారంభం.

4. అసుస్ 6జెడ్

డిస్ ప్లే: 6.4 అంగుళాల డిస్ ప్లే కెమెరా: 48 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855
ధర: రూ.27,999 నుంచి ప్రారంభం

5. అసుస్ రోగ్ ఫోన్ 2

డిస్ ప్లే: 6.59 అంగుళాల డిస్ ప్లే కెమెరా:
 48 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 24 మెగా పిక్సెల్ ర్యామ్: 8 జీబీ బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ధర: రూ.40,999 నుంచి ప్రారంభం


6. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్

డిస్ ప్లే: 6.7 అంగుళాల డిస్ ప్లే కెమెరా: 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ బ్యాటరీ: 4500 ఎంఏహెచ్
ప్రాసెసర్: శాంసంగ్ ఎక్సినోస్ 9810 ధర: రూ.37,999 నుంచి ప్రారంభం

7. ఐఫోన్ ఎస్ఈ 2020

డిస్ ప్లే: 4.7 అంగుళాల డిస్ ప్లే
కెమెరా: 12 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 7 మెగా పిక్సెల్
ర్యామ్: 4 జీబీ బ్యాటరీ: 1821 ఎంఏహెచ్ ప్రాసెసర్: యాపిల్ ఏ13 బయోనిక్
ధర: రూ.42,500 నుంచి ప్రారంభం.

8. ఐఫోన్ 11

డిస్ ప్లే: 6.1 అంగుళాల డిస్ ప్లే
కెమెరా: 12 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 12 మెగా పిక్సెల్
ర్యామ్: 4 జీబీ బ్యాటరీ: 3110 ఎంఏహెచ్
ప్రాసెసర్: యాపిల్ ఏ13 బయోనిక్
ధర: రూ.68,300 నుంచి ప్రారంభం

9. శాంసంగ్ గెలాక్సీ ఎస్20

డిస్ ప్లే: 6.2 అంగుళాల డిస్ ప్లే
కెమెరా: 12 మెగా పిక్సెల్ + 64 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 10 మెగా పిక్సెల్
ర్యామ్: 12 జీబీ
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865
ధర: రూ.70,499 నుంచి ప్రారంభం

10. ఎల్జీ జీ8ఎక్స్ థింక్
డిస్ ప్లే: 6.4 అంగుళాల డిస్ ప్లే

కెమెరా: 12 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 32 మెగా పిక్సెల్
ర్యామ్: 6 జీబీ
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ప్రాసెసర్: క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855
ధర: రూ.54,999 నుంచి ప్రారంభం

చైనాకు మరో ఝలక్ ఇచ్చిన భారత్.. ఈసారి దౌత్యపరంగా దెబ్బ!

చైనాకు మరో ఝలక్ ఇచ్చిన భారత్.. ఈసారి దౌత్యపరంగా దెబ్బ!

Economic impact of India-China conflict: Why there won't be just ...

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వరుసగా చైనాకు షాకులిస్తోంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించి తొలి షాక్ ఇచ్చిన భారత్.. హైవే ప్రాజెక్టుల్లో చైనా సంస్థలకు అనుమతులు నిరాకరించనున్నట్లు తెలిపింది. తాజాగా డ్రాగన్‌కు మరో ఝలక్ కూడా ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయంపత్రిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసినప్పుడు పాకిస్థాన్ గగ్గోలు పెట్టగా... దానికి చైనా వంతపాడిన సంగతి తెలిసిందే కదా. అసలు గాల్వన్‌లో ఘర్షణలకు దిగడానికి కూడా ఇదే బలమైన కారణం అనే వాదన కూడా ఉంది.ఇదే చైనా హాంకాంగ్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలిసిందే. తాజాగా హాంకాంగ్ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలిపింది. డ్రాగన్ చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తుండగా.. భారత్ మాత్రం ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. కానీ హాంకాంగ్‌ విషయంలో భారత్ తొలిసారిగా స్పందించింది. జెనీవాలోని మానవ హక్కుల సంఘంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. హాంకాంగ్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని ప్రకటించింది.


‘ఈ పరిణామాలపై వ్యక్తమవుతున్న అనేక అభ్యంతరాలను వింటున్నాం. ఈ విషయంలో సంబంధిత పార్టీలు తగిన రీతిలో వ్యవహరిస్తాయని ఆశిస్తున్నాం’ అని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ చందెర్ వ్యాఖ్యానించారు. కానీ ఆయన చైనా పేరును మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.


హాంకాంగ్‌‌ కొత్త చట్టం విషయంలో చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని 27 దేశాలు సూచించాయి. 4 క్వాడ్ దేశాల్లో అమెరికా ముందుగా స్పందించగా.. జపాన్, ఆస్ట్రేలియా కూడా చైనా చర్యను వ్యతిరేకించాయి. దీంతో చివరకు భారత్ కూడా చైనా తీరుపట్ల స్పందించింది.


1997 వరకు హాంకాంగ్‌ బ్రిటిషర్ల అధీనంలో ఉంది. తర్వాత చైనా చేతిలోకి వెళ్లింది. హాంకాంగ్‌లో వేర్పాటు వాదం, విదేశీ జోక్యాన్ని నివారించే పేరిట అక్కడి ప్రజల స్వేచ్ఛను హరించడం చైనా ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినవారు, ఆదేశాలను ధిక్కరించిన వారు శిక్షార్హులు.

DATA Entry Operator/full & Part-time/work FROM Home/computer Operator

Job description Immediate Opening for Data Entry Operator Transfer data from PDF formats in system. Computer / Laptop Or Android Phone I...